- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: ఉగ్రవాదాన్ని ఆపాలని పాక్‌కు సూచించండి.. తుర్కియేకు భారత్ పిలుపు
భారత్ పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే పాక్‌కు మద్దతుగా నిలుస్తుండటంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాకిస్థాన్ (india pakisthan) ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే పాక్‌కు మద్దతుగా నిలుస్తుండటంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇప్పటికే తుర్కియేకు సందేశం ఇచ్చిన భారత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేయాలని, టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ విషయాన్ని తుర్కియే పాక్‌కు సూచించాలని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadeer Jaiswal) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పాక్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పూర్తిగా మానేయాలి. దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని తుర్కియే కోరుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
ఒకరి ఆందోళనల పట్ల మరొకరు సున్నితంగా వ్యవహరించే తీరు ఆధారంగానే ద్వైపాక్షిక సంబంధాలు నిర్మించబడతాయన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుని, గతంలో మేము సూచించిన ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించే వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామన్నారు. అంతేగాక పాక్‌తో ఎటువంటి చర్చలు సైతం జరగబోవని తెలిపారు. ఈ విషయంలో భారత వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు కాబట్టి సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తామన్నారు.






