- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలంకలో భారత్ సహాయక చర్యలు వేగవంతం.. ఆపరేషన్ సాగర్ బంధులో ఎమ్ఐ-17 వీ5 హెలికాప్టర్లు: ఐఏఎఫ్
శ్రీలంకలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వేగాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) మరింత పెంచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీలంకలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వేగాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF) మరింత పెంచింది. (OperationSagarBandhu) ‘ఆపరేషన్ సాగర్ బంధు’లో భాగంగా కోలంబోలో ఎమ్ఐ-17 వీ5 హెలికాప్టర్లను మోహరించినట్లు IAF తెలిపింది. ఈ మేరకు ఆదివారం భారత వైమానిక దళం ట్వీట్ చేస్తూ ఆపరేషన్‌కు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఇది అత్యవసర మానవతా సహాయం, విపత్తు నిర్వహణ (HADR) కార్యకలాపాల కోసం సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది.
భారతీయులను భారీ స్థాయిలో తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్ విమానాలను కూడానూ సిద్ధం చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది. తిరువనంతపురం, హిండన్ (Hindan) ఎయిర్‌బేస్‌ల నుంచి అనేక ఎయిర్‌లిఫ్ట్ మిషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. భారత పౌరుల తరలింపుతో పాటు అత్యవసర సహాయక సరుకులు, వైద్య పరికరాలు వంటి సామగ్రిని కూడా శ్రీలంకకు పంపిస్తున్నట్లు తెలిపింది. ప్రక్కనే ఉన్న దేశాలకు అవసరమైన సమయంలో సహాయం అందించడం, ప్రాణాలను రక్షించడం తమ ధర్మంగా భావిస్తున్నట్లు IAF స్పష్టం చేసింది. కాగా, శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. ప్రళయాన్ని తలపించేలా కురిసిన వర్షాలు, ఉద్ధృత ప్రవాహాల కారణంగా ఇప్పటి వరకు 153 మంది మరణించగా, 191 మందికి పైగా గల్లంతయ్యారు.






