MSMEల అభివృద్ధి కోసం InDApp

by Naga Rani Yarlagadda |

దేశంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME)అభివృద్ధి చేసేందుకు, వాటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపరిచేందుకు..

MSMEల అభివృద్ధి కోసం InDApp
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME)అభివృద్ధి చేసేందుకు, వాటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపరిచేందుకు నేషనల్ ఇండస్ట్రీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NIRDC)InDApp ను రూపొందించింది. ఈ యాప్ ను కేంద్ర మంత్రి భన్వరి లాల్ వర్మ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. InDApp ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా రూపొందించినట్లు తెలిపారు. ఇది ఎంఎస్ఎంఈల కార్యకలాపాల్లో వేగం, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ప్రభుత్వ అనుమతులు, రియల్‌టైమ్‌ మార్కెట్‌ సమాచారం, జాతీయ వ్యాప్తంగా ఉన్న వ్యాపార అవకాశాలకు సులభంగా ప్రాప్యతను కల్పించడం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ సుగమమైన, అవగాహనతో కూడిన వ్యాపార నిర్ణయాలను తీసుకునేలా పారిశ్రామికవేత్తలకు శక్తినిస్తుందని పేర్కొన్నారు.

ఎంఎస్ఎంఈల ఎగుమతి ప్రమోషన్ పథకాలు, ఆర్థిక సబ్సిడీలు, సాంకేతికత అప్ గ్రేడ్ లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తక్షణమే పొందేందుకు అనుమతిస్తుందని వివరించారు. వ్యాపారంలో ప్రతి దశలోనూ మార్గనిర్దేశం చేయడంతో పాటు.. భాగస్వాములకు సహకారుల్ని కలిసే అవకాశాలను విస్తరింపజేస్తుంది. ఇండ్ యాప్ జాతీయ, గ్లోబల్ స్థాయిలో ఉన్న అవకాశాలకు ఎంఎస్ఎంఈల ప్రాప్తిని పెంచడం ద్వారా భారత ఎకోసిస్టమ్ లో సమగ్రతను బలోపేతం చేసి పోటీ శీలతను పెంచుతుందని తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థలో MSME రంగం GDP, ఎగుమతులు, భారీ స్థాయిలో ఉపాధి సృష్టిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్యాపార అవకాశాలకు సులభ ప్రాప్యతను కల్పించడం, పారదర్శకతను పెంచడం, అనుమతులు, ప్రక్రియలను సరళీకరించడం ద్వారా రంగ అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. ఆయా రంగాల మధ్య మెరుగైన సమన్వయాన్ని సాధించేందుకు ఇండ్ యాప్ ను 7 కేంద్ర మంత్రిత్వశాఖలతో కలిసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వీటిలో ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, మత్స్య, పశుసంవర్థక & పాడి పరిశ్రమ శాఖ, వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, వాణిజ్య & పరిశ్రమ మంత్రిత్వ శాఖ, పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నూతన & పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఉన్నాయి.

Next Story