- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ind -Pak War: జైసల్మేర్ లో మళ్లీ బ్లాక్ అవుట్..! ఇందుకేనా?
రాజస్థాన్ (Rajastan) జైసల్మేర్ (Jaisalmer) లో ఆదివారం రాత్రి బ్లాక్ అవుట్ (Block Out) ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ (Rajastan) జైసల్మేర్ (Jaisalmer) లో ఆదివారం రాత్రి బ్లాక్ అవుట్ (Block Out) ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు బ్లాక్ అవుట్ విధించపబడుతుందని ప్రకటించారు. భారత్ -పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియాపై పాకిస్థాన్ దాడి చేస్తున్న సమయంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ విధించిన విషయం తెలిసిందే. శనివారం చేసుకున్న కాల్పుల విరమణ, సైనిక చర్య విరమణ ఒప్పందం (Ceasefire Agreement)తో భారత్ -పాక్ దేశాల నడుమ ఉద్రిక్తతలు దాదాపు ఆగిపోయాయి.
అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ లో జిల్లా అధికారులు ఇవాళ కూడా బ్లాక్ అవుట్ ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా జైసల్మేర్ పౌరులందరూ ఈరోజు సాయంత్రం 7:30 నుండి రేపు ఉదయం 6 గంటల వరకు బ్లాక్‌అవుట్ ప్రకటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో, పరిసరాల్లోని లైట్లు ఆపివేయాలని, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని పౌరులకు జైసల్మేర్ జిల్లా యంత్రాంగం సూచించింది. దాడులు ఆగిపోయాక కూడా బ్లాక్ అవుట్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. కాల్పుల విరమణ చేసుకున్న పాకిస్థాన్ పై నమ్మకం లేక ముందస్థు బ్లాక్ అవుట్ ప్రకంటించుకున్నారా? లేక దాడులపై స్పష్టమైన సమాచారం అందిందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.






