ఆహా చినాబ్.. మేఘాల అందాల్లో ఆకట్టుకుంటోన్న వంతెన

by Naga Rani Yarlagadda |

జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir) రియాసీలోని చినాబ్ రైలు వంతెన (Chenab Arch Railway Bridge) సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది.

ఆహా చినాబ్.. మేఘాల అందాల్లో ఆకట్టుకుంటోన్న వంతెన
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ (Jammu&Kashmir) రియాసీలోని చినాబ్ రైలు వంతెన (Chenab Arch Railway Bridge) సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. ఆర్చి ఆకారంలో ఉన్న ఈ వంతెన సాధారణంగానే పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆ వంతెన చుట్టూ మేఘాలు అలుముకోవడంతో వంతెన మరింత అందంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైల్వే బ్రిడ్జి చుట్టూ మేఘాలు కమ్ముకోవడంతో మరింత అందంగా కనిపిస్తోంది. ఆ వీడియోలను పర్యాటకులు నెట్టింట షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

చీనాబ్ నదిపై (Chenab River) ఉన్న రెండు ఐకానిక్ వంతెనలు మేఘాల మధ్య అందంగా కనిపిస్తున్నాయి. ఆర్చ్ రైల్వే వంతెన , కాట్రా వైష్ణోదేవిని శివఖోరి అండ్ రాజౌరి-పూంచ్ కు దారిలో 50 ఏళ్లకు పైగా ఉన్న పురాతనమైన బారాదరి రోడ్డు వంతెన ఆకట్టుకుంటున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ రెండింటినీ చూసేందుకు అద్భుతంగా కనిపిస్తున్నాయని, నిజంగా వాటిని కన్నులారా వీక్షిస్తే ఆ అనుభూతే వేరని అభిప్రాయపడుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి

Next Story