- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుచిత వ్యాఖ్యలు మా విధానం కాదు.. బీజేపీకి KC వేణుగోపాల్ స్ట్రాంగ్ కౌంటర్
టర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నిరసన ‘ఓట్ చోరీ’ (Vote Chori) ఆరోపణలపై బీజేపీ (BJP) ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ నిరసన ‘ఓట్ చోరీ’ (Vote Chori) ఆరోపణలపై బీజేపీ (BJP) ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. మోదీని అంతం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తల నినాదాలు తీవ్రంగా ఉన్నాయని కాషాయ పార్టీ ఫైర్ అయింది. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఎన్నికల సంఘంపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, మోదీని 150 సార్లకుపైగా ఆ పార్టీ నాయకులు అవమానించారని విమర్శించింది.
ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిరాధారమైన అంశాలపై బీజేపీ డ్రామాలు చేసోందని ఆరోపించారు. గత 10 నుంచి 15 ఏళ్లలో ఢిల్లీ (Delhi)లో చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీకి ఇంత ఆదరణ ఎన్నడూ రాలేదన్నారు. వచ్చిన జనాన్ని చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని ఫైర్ అయ్యారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై.. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయబోమని అన్నారు. ఆ విధానం మాది కాదని స్పష్టం చేశారు. గతంలో అమిత్ షా మాట్లాడిన భాష ఏంటో ప్రజలందరికీ తెలుసని కేసీ వేణుగోపాల్ చురకలంటించారు.






