- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు.. మహిళను విచారించిన పోలీసులు
ముంబైకి చేరుకున్న తర్వాత తనను ధృవీకరణ పత్రాలు అడగని రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో:
నటుడు సైఫ్ అలీఖాన్‌పై బంగ్లాదేశ్‌కు చెందిన సరీఫుల్ ఇస్లామ్ దాడి చేసిన కేసులో ఒక మహిళను విచారించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన సరీఫుల్‌కు ఒక మహిళ సిమ్ కార్డు సమకూర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా చాప్రాకు చెందిన ఖుకుమోని షేక్ అనే మహిళ ఈ సిమ్ కార్డును నిందితుడికి ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ఉపయోగించిన సిమ్ కార్డును ట్రేస్ చేయగా.. ఖకుమోని షేక్ పేరుతో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. దీంతో ఆమెను విచారించగా.. తన ఫోన్ చోరీకి గురైందని పోలీసులకు తెలిపింది. కాగా, నిందితుడు బంగ్లాదేశ్ నుంచి ఏడు నెలల క్రితం మేఘాలయకు చేరుకున్నాడు. కొన్ని వారాల పాటు బెంగాల్‌లో తలదాచుకున్నాడని, అక్కడే తన పేరు బిజొయ్ దాస్‌గా మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగాల్‌లో స్థానికుల ఆధార్ కార్డు ఉపయోగించి సిమ్ కార్డు కొనుగోలు చేశాడని, ఆ తర్వాత ముంబై వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ముంబైకి చేరుకున్న తర్వాత తనను ధృవీకరణ పత్రాలు అడగని రెస్టారెంట్లు, ఇతర ప్రదేశాల్లో పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 12వ తరగతి వరకు చదువుకున్న ఇస్లామ్.. జాబ్ కోసమే ఇండియాకు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, షరీఫుల్ ఇస్తామ్ నుంచి రెండు ఐడెంటిటీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి బంగ్లాదేశీ నేషనల్ ఐడెంటిటీ కార్డు, మరొకటి లెర్నర్ డ్రైవింగ్ లైసెన్సుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ కార్డులను బట్టి షరీఫుల్ సౌత్ సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని బరిసాల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.






