Justice BR Gavai: రాజ్యాంగమే అన్నిటికన్నా అత్యుత్తమైంది: జస్టిస్ బీఆర్ గవాయ్

by S Gopi |

రాజ్యాంగ విలువలతోపాటు సూత్రాలకు బాధ్యుడనే విషయాన్ని న్యాయమూర్తి అనుక్షణం గుర్తుంచుకోవాలి.

Justice BR Gavai: రాజ్యాంగమే అన్నిటికన్నా అత్యుత్తమైంది: జస్టిస్ బీఆర్ గవాయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ భారత రాజ్యాంగమే దేశంలో అత్యున్నత అధికారం అని, ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు - కార్యనిర్వాహక, శాసనసభ, న్యాయవ్యవస్థ - దానికిందనే కలిసి పనిచేయాలని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి స్వస్థలమైన అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ పై వ్యాఖ్యలు చేశారు. 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు 'ప్రాథమిక నిర్మాణం' సిద్ధాంతాన్ని - అంటే పార్లమెంటు ఆమోదించిన సవరణల ద్వారా రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలను మార్చలేమని ఉంది. దీన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు అధికారాలు ఉన్నాయి. కానీ, రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని మార్చడం వీలవదన్నారు. రాజ్యాంగ విలువలతోపాటు సూత్రాలకు బాధ్యుడనే విషయాన్ని న్యాయమూర్తి అనుక్షణం గుర్తుంచుకోవాలి. మనకు అధికారం మాత్రమే కాకుండా బాధ్యత కూడా ఉందన్నారు.

శాసన, న్యాయ, కార్యనిర్వాహక విభాగాల్లో ఏది అత్యున్నతమైందని తరచూ చర్చ తలెత్తుతోందని గవాయ్‌ అభిప్రాయపడ్డారు. చాలామంది పార్లమెంట్‌ అత్యున్నతమైందని అంటారు. కానీ, నా ఉద్దేశంలో భారత రాజ్యాంగమే అత్యంత ముఖ్యమైంది. ప్రజాస్వామ్యంలోని మిగిలిన మూడు విభాగాలు దానికిందే పనిచేస్తాయి. మనం ప్రజల హక్కులకు, రాజ్యాంగ విలువలు, నిబంధనలకు రక్షకులం. తీర్పుల గురించి ప్రజలు ఏమనుకొంటున్నారు అనే అభిప్రాయం జడ్జీలను ప్రభావితం చేయకూడదు. మనం స్వతంత్రంగా ఆలోచించాలన్నారు. తాను రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు అండగా ఉంటానని పేర్కొన్నారు.

Next Story