- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌లో ఉగ్రవాదులను పట్టిస్తే జైలుకే..పెంచి పోషించే వారికే రివార్డులు: శశిథరూర్
పాక్‌లో ఉగ్రవాదులను పట్టిస్తే జైలుకే పంపుతారని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారికే రివార్డులు ఇస్తారని శశిథరూర్ ఎద్దేవా చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను ప్రమోట్ చేస్తే రివార్డులిస్తారని, అదే వారిని పట్టిస్తే శిక్షిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. వాషింగ్టన్‌లో ఉన్న దౌత్యబృందానికి నాయకత్వం వహిస్తున్న ఆయన.. పాక్‌కు చెందిన డాక్టర్ షకీల్ అఫ్రిదీని ఆ దేశం అరెస్టు చేయడాన్ని ఖండించిన యూఎస్ నేత బ్రాడ్ షెర్మన్‌కు మద్దతు తెలిపారు. ‘ఒసామా బిన్ లాడెన్‌ను యూఎస్‌కు పట్టించిన డాక్టర్ షకీల్ అఫ్రిదీ ఇంకా పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. ఆయన్ను విడుదల చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వానికి చెప్పాలని పాకిస్తాన్ దౌత్యబృందానికి చెప్పాను’ అని షెర్మన్ ఒక పోస్టు చేశారు.
దీనిపై స్పందించిన థరూర్.. ‘ఉగ్రవాద మాస్టర్‌మైండ్ ఒసామా బిన్ లాడెన్‌ను తమ దేశంలోనే ఒక ఆర్మీ క్యాంప్ దగ్గర్లో దాచిపెట్టిన పాకిస్తాన్.. అతన్ని అమెరికన్లకు పట్టించాడనే కారణంతో ఒక డాక్టర్‌ను అరెస్టు చేసి శిక్షిస్తుందని రిప్రజంటేటివ్ బ్రాడ్ షెర్మన్ గుర్తుచేయడం ఆహ్వానించదగిన విషయం. పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసే వారికి రివార్డులు అందుతాయి. కానీ టెర్రరిస్టులను పట్టిస్తే మాత్రం శిక్షలు తప్పవన్నమాట!’ అని పేర్కొన్నారు. లాడెన్‌ను పట్టుకోవడంలో అమెరికన్ సీఐఏ అధికారులకు డాక్టర్ అఫ్రిదీ చాలా సహాయం చేశారు.






