- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహల్గామ్ దాడి.. ఒక ఆదిల్ ప్రాణం ఇస్తే మరో ఆదిల్ ప్రాణం తీశాడు

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ దాడి ఘటన దేశం మొత్తాన్ని విషాదంలోకి నెట్టివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను ఏరిపారేస్తోంది. పాక్ ఉగ్రమూకలపై మెరుపుదాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో బార్డర్ వద్ద యుద్దవాతావరణం నెలకొంది. ఇండియాా పాకిస్థాన్ మధ్య యుద్దం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు హిందువులనే టార్గెట్ చేసుకుని హతమార్చినట్టు బాధితులు చెప్పారు. ఐడీ కార్డులు చూసి మరీ చంపేశారని అన్నారు.
హిందువులనే టార్గెట్ చేసినప్పటికీ వారిని కాపాడేందుకు స్థానికుడు, గుర్రం నడుపుతూ జీవించే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ తన ప్రాణాలను అడ్డుపెట్టాడు. వారిని కాపాడే ప్రయత్నం చేయడంతో ఉగ్రవాదులు అతడిని సైతం హతమార్చారు. ఆదిల్ చనిపోవడంతో అతడి కుటుంబం రోడ్డున పడింది. తమ కుటుంబాన్ని పోశించేది ఆదిల్ అని అతడి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఇదే ఉగ్రదాడిలో మరో ఆదిల్ కూడా ఉన్నాడు. ఉగ్రమూకలో అతడు కూడా ఒకరు. అతడి పూర్తి పేరు ఆదిల్ హుస్సేన్ తోకర్ కాగా లష్కరే తోయిబాలో శిక్షణ తీసుకుని ఉగ్రవాదిగా మారాడు.
2018లో ఆదిల్ హుస్సేన్ తోకర్ కశ్మీర్ నుండి పాకిస్థాన్ వెళ్లి ఆయుదాల శిక్షణ తీసుకున్నాడని ఇంటిలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. తరవాత మళ్లీ కశ్మీర్ కు తిరిగి వచ్చి టూరిస్ట్ గైడ్‌లా నటించినట్టు తెలిపారు. పహల్గామ్ దాడిలో ఆదిల్ హుస్సేన్ తోకర్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించారు. స్థానికుడు కావడంలో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్లాన్ వేయడంతో పాటూ స్థానికుల నివాసాల్లో వారు బస చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటిలిజెన్స్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాది ఆదిల్ కోసం ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. ఏ క్షణమైనా అతడిని ఆర్మీ అంతం చేసే అవకాశం ఉంది. ఇక ఒకే ఘటనలో ఒకరు రక్తం పారిస్తే మరొకరు పర్యాటకుల ప్రాణాలు కాపాడేందుకు రక్తాన్ని దారపోయడంతో ఇద్దరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






