- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూతులు మాట్లాడితే ఫైన్.. లేదంటే ఊరు ఊడ్చాల్సిందే ఆ గ్రామంలో సరికొత్త రూల్స్
మధ్యప్రదేశ్‌లోని బోర్సర్ గ్రామం తొలి బూతు రహిత గ్రామంగా నిలిచింది. ఇక్కడ బూతులు మాట్లాడితే జరిమానా విధిస్తారు లేదా ఊరిని శుభ్రం చేయాలి.

దిశ, డైనమిక్ బ్యూరో: మన దేశంలోని ఒక్కో గ్రామానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని గ్రామాల్లోని పర్యాటక ప్రాంతాలతో ప్రసిద్ధికెక్కితే మరికొన్ని అక్కడి ఇతర విశేషాలతో అందరిని ఆకట్టుకుంటాయి. కానీ మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామం మాత్రం బూతు పదాలు మాట్లాడని గ్రామంగా నిలిచింది. రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఉన్న బోర్సర్ గ్రామం ఇకపై ఎవరూ బూతులు మాట్లాడని తొలి బూతు రహిత గ్రామంగా ప్రకటించబడింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ బూతులు మాట్లాడటాన్ని నిషేధించడమే కాదు ఎవరైనా అతిక్రమిస్తే జరిమానా విధించేలా నిర్ణయించారు. అయితే ఎవరైనా జరిమానా చెల్లించని పక్షంలో వారు గంట పాటు గ్రామాన్ని శుభ్రం చేసే పని చేయాలని నియమం పెట్టుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
టీవీ నటుడి ఆలోచన.. ఊరి జనాల మద్దతు:
ఈ మార్పు వెనుక ఆ గ్రామానికి చెందిన టీవీ నటుడు అశ్విన్ పాటిల్ కృషి ఎంతో ఉంది. గతంలో అన్ని గ్రామాల్లో మాదిరిగానే ఈ గ్రామంలో కూడా గొడవలు, బూతు పదాలు వినిపించేవి. దీంతో తొలుత గ్రాన్ని శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టిన అశ్విన్ పాటిల్ ఆ తర్వాత గ్రామస్తుల మాటలను కూడా శుభ్రం చేయాలని కంకణం కట్టుకున్నాడు. తన ఉద్దేశాన్ని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు వివరించాడు. గ్రామస్థులందరినీ ఒప్పించి ఏకగ్రీవంగా పంచాయతీలో గ్రామంలో బూతులు మాట్లాడటానికి వ్యతిరేకంగా తీర్మానం చేయించాడు. ఈ మంచి ఆలోచనపై చర్చించిన గ్రామ పంచాయతీ ఈ మేరకు తీర్మానం చేసింది. ఊరంతటా ఇక్కడ బూతులు మాట్లాడటం నిషేధం అనే పోస్టర్లు అతికించారు. డప్పు చాటింపు వేయించి అందరికీ నిబంధనలను వివరించారు. దీంతో బూతులు మాట్లాడని తొలి బూతు రహిత గ్రామంగా బుర్హాన్‌పూర్ ప్రకటించబడింది.






