- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతులు, కాళ్లు నరికి.. శవాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి.. దారుణ హత్య..
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల పిల్లాడు అభయ్ ప్రతాప్‌ను దారుణంగా హత్య చేశారు దుర్మార్గులు. అతని శరీరాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి భూమిలో పాతిపెట్టారు. మూడు నెలల పాటు కిడ్నాపర్లు,

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల పిల్లాడు అభయ్ ప్రతాప్‌ను దారుణంగా హత్య చేశారు దుర్మార్గులు. అతని శరీరాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి భూమిలో పాతిపెట్టారు. మూడు నెలల పాటు కిడ్నాపర్లు, అభయ్ కుటుంబం మధ్య ర్యాన్సమ్ మొత్తం గురించి చర్చలు జరగ్గా.. చివరకు ఇలా శవమై తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు పిల్లాడు.
అభయ్ ప్రతాప్‌ను కిడ్నాప్ చేసి ₹80 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబానికి నాలుగు లెటర్స్ రాశారు. డబ్బులు చెల్లించకపోతే అభయ్ చేతులు, కాళ్లు కత్తిరిస్తామని బెదిరించారు. అభయ్ కుటుంబం పోలీసులను సంప్రదించింది. ఒక FIR నమోదు చేయబడింది. మూడు నెలల తర్వాత రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలోని మానియా ప్రాంతంలో రోడ్డు సమీపంలో పాతిపెట్టిన అభయ్ శరీరం బయటపడింది. మానియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ నరేష్ మీనా ప్రకారం.. శరీరం పోస్ట్‌మార్టమ్ కోసం పంపబడింది. నేరస్థులను పట్టుకునేందుకు పోలీసుల విచారణ కొనసాగుతోంది.






