- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు
తొలి కేబినెట్ భేటీ నిర్ణయాలపై మాజీ సీఎం ఆతిశీ పెదవి విరిచారు. అర్హులైన మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తొలి రోజే తుంగలో తొక్కారని ఆతిశీ ఆరోపించారు.

- 14 కాగ్ రిపోర్టులు అసెంబ్లీ ముందుకు
- ఢిల్లీ తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
దిశ, నేషనల్ బ్యూరో:
ఢిల్లీలో ప్రభుత్వం కొలువుతీరిన తొలి రోజు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో ఇకపై ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో ఆప్ ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను ఢిల్లీలో అమలు చేయలేదు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకానికి టాప్ అప్‌గా మరో రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం రేఖాగుప్తా చెప్పారు. సాధ్యమైనంత త్వరలోనే ఢిల్లీ ప్రజలు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని సీఎం తెలిపారు. ఆప్ ప్రభుత్వ సమయంలో తొక్కిపెట్టిన 14 కాగ్ రిపోర్టులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కేబినెట్ నిర్ణయించింది. ఇందులో రద్దు చేయబడిన లిక్కర్ పాలసీకి సంబంధించిన రిపోర్టు కూడా ఉంది. ఈ కేసులోనే మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
మహిళలను మోసం చేసింది : మాజీ సీఎం ఆతిశీ
తొలి కేబినెట్ భేటీ నిర్ణయాలపై మాజీ సీఎం ఆతిశీ పెదవి విరిచారు. అర్హులైన మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని తొలి రోజే తుంగలో తొక్కారని ఆతిశీ ఆరోపించారు. ఎన్నికల హామీని ఎందుకు నెరవేర్చలేదని ఆమె ప్రశ్నించారు. అయితే మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని ఆతిశీని సీఎం రేఖా గుప్తా ప్రశ్నించారు. ఇది మా ప్రభుత్వం, అది మా అజెండా.. సమయం వచ్చినప్పుడు అన్ని హామీలు అమలు అవుతాయని సీఎం రేఖా అన్నారు.






