ఇమ్రాన్ ఖాన్ సేఫ్.. కానీ..!

by Muthe.Rajitha |

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఇమ్రాన్ ఖాన్ సేఫ్.. కానీ..!
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మృతిచెందారంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వదంతులకు ఎట్టకేలకు తెరపడింది. జైలు అధికారులు మంగళవారం ఇమ్రాన్‌ సోదరి ఉజ్మా ఖానుమ్‌తో పాటు ఓ లాయర్‌ను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు. దీంతో ఆయన మృతి చెందారనే రూమర్స్ కి చెక్ పడింది. అయితే కొన్నిరోజులుగా ఇమ్రాన్‌ ఖాన్‌ మరణించారనే పుకార్లు వ్యాపించగా.. పాకిస్థాన్ ప్రభుత్వం వాటిని ఖండించింది. ప్రభుత్వ మాటలను పట్టించుకోకుండా ఆయన్ని వెంటనే చూపించాలని, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించాలని మద్దతుదారులు డిమాండ్‌ చేయడమే కాదు, జైలు ముందు భారీ ధర్నాకు దిగారు.

ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలంటూ కుటుంబ సభ్యులు కోరగా, జైలు అధికారులు మంగళవారం వరకూ నిరాకరించడంతో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌(PTI) పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో జైలు అధికారులు మంగళవారం ఇమ్రాన్‌ సోదరితో పాటు ఓ లాయర్‌ను ఆయన్ని కలిసేందుకు అనుమతించారు. అయితే ఇమ్రాన్‌ జైల్లో సురక్షితంగానే ఉన్నారని కానీ, ఆయన్ని ప్రభుత్వం, అధికారులు మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించింది.

Next Story