- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇమ్రాన్ బతికే ఉన్నాడు : పాక్ సెనెటర్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, ఇమ్రాన్ పార్టీకే చెందిన సెనెటర్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, ఇమ్రాన్ పార్టీకే చెందిన సెనెటర్ ప్రకటించారు. ఇటీవల ఇమ్రాన్ చనిపోయారని వస్తున్న తప్పుడు వార్తలను పీటీఐ సెనేటర్ ఖుర్రం జీషన్ ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, ప్రస్తుతం రావల్పిండీ అడియాలా జైలులోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇమ్రాన్ కు ఉన్న భారీ ప్రజాదరణ చూసి ప్రభుత్వం భయపడుతోంది అందుకే దాదాపు ఒక నెల నుంచి పూర్తిగా ఒంటరిగా (సోలిటరీ కాన్ఫైన్‌మెంట్) ఉంచారని వెల్లడించారు.
కుటుంబం, న్యాయవాదులు, పార్టీ నాయకులు ఎవరూ కలవడానికి అనుమతి లేదని, ఫోటోలు-వీడియోలు కూడా రిలీజ్ చేయడం లేదన్నారు. ఇమ్రాన్ పాకిస్తాన్ వదిలి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా అడియాలా జైలు అధికారులు కూడా ఇమ్రాన్ ఆరోగ్యం బాగుందని, చనిపోయారని వస్తున్న రూమర్స్ అబద్దం అని ప్రకటించారు. కానీ ఇమ్రాన్ కుమారుడు కాసిం సూరీ ఇమ్రాన్ "ప్రూఫ్ ఆఫ్ లైఫ్" డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.






