Pahalgam attack: ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టో ఎక్స్ అకౌంట్స్ నిలిపివేత

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్‌ అనేక కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), ఆ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాక్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో (Bilawal Bhutto)ల ఎక్స్ అకౌంట్స్ ని నిలిపివేసింది.

Pahalgam attack: ఇమ్రాన్ ఖాన్, బిలావల్ భుట్టో ఎక్స్ అకౌంట్స్ నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్‌ అనేక కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan), ఆ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాక్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో (Bilawal Bhutto)ల ఎక్స్ అకౌంట్స్ ని నిలిపివేసింది. ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అధికారిక ఎక్స్‌ అకౌంట్ ని కూడా బ్లాక్‌ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్‌పై వారు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల పాకిస్థాన్ రక్షణమంత్రి (Pakistani Defence Minister) ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్‌ ఖాతా (X Handle)ను భారత్‌ నిలిపివేసింది. పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్లు (Ban on Youtube Channels), న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది.

ఉగ్రదాడి తర్వాత..

పహెల్గాం ఉగ్రదాడిపై తర్వాత ఇమ్రాన్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ పాక్‌పై దాడులకు దిగితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో సైతం ఇదే విధంగా భారత్‌పై నోరు పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాం (Pahalgam terror attack)లో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది.

Next Story