- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Immigrants: పర్వతాలు, కొండలు దాటి ప్రయాణం.. యూఎస్ నుంచి వచ్చిన భారతీయుల బాధలు వర్ణణాతీతం!
అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయ వలసదారులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయ వలసదారులను (Indian immigrants) ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వాళ్ల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఏజెంట్ల ద్వారా మోస పోయి కొందరు చట్టవిరుద్ధంగా అమెరికా చేరుకుంటే, మరి కొందరిని వాళ్ల ఏజెంట్లే వక్రమార్గం గుండా అమెరికాకు తరలించారు. కొన్ని వందల కిలోమీటర్ల పాటు నడవడం, పర్వతాలు, కొండలు, సముద్రాలు దాటి యూఎస్ చేరుకున్నారు. దీంతో చట్టబద్ధంగా యూఎస్ వెళ్లాలనే కొందరి కలలు కల్లలయ్యాయి. ఈ క్రమంలో వాళ్లు అనుభవించిన వేదనను మీడియాతో పంచుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఏజెంట్లే కిల్లర్లు
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ అమెరికాకు చట్టబద్ధంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఏజెంట్‌కు రూ. 30లక్షలు చెల్లించినట్టు తెలిపారు. కానీ ఏజెంట్ మొదట బ్రెజిల్‌కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అమెరికాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు. అనంతరం బ్రెజిల్‌లో ఆరు నెలలు ఉన్న తర్వాత అక్రమంగా బ్రెజిల్ సరిహద్దు దాటి అమెరికా చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో జనవరి 24న ఆయనను యూఎస్ అధికారులు పట్టుకుని 11 రోజుల నిర్భంధం తర్వాత ఇండియాకు తీసుకొచ్చాడని చెప్పాడు. అయితే భారత్‌కు తీసుకొచ్చే క్రమంలో చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేశారని, అమృత్‌సర్ విమానాశ్రయంలో వీటిని తీసేశారని తెలిపారు.
సముద్రంలో ప్రాణాలతో బయటపడ్డాం
పంజాబ్ హోషియార్‌పూర్‌లోని తహ్లి గ్రామానికి చెందిన చెందిన హర్వీందర్ సింగ్ ఒక ఏజెంట్‌కు రూ.42 లక్షలు చెల్లించి మోస పోయాడు. గతేడాది అమెరికాకు తీసుకెళ్తానని చెప్పిన ఏజెంట్లు మోసం చేసి ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, మెక్సికో వంటి అనేక దేశాల గుండా అమెరికాకు చేర్చారు. ఈ క్రమంలో రోజుల తరబడి నడిచామని, పర్వతాలను దాటామని తెలిపారు. ఇతర వ్యక్తులను తీసుకెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయే దశలో ఉందని, కానీ మేము ప్రాణాలతో బయటపడ్డామని గుర్తు చేసుకున్నారు. పనామా అడవిలో ఒక వ్యక్తి చనిపోవడాన్ని, మరొకరు సముద్రంలో మునిగిపోవడాన్ని కళ్లారా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు.
దారి పొడవునా మృత దేహాలే
పంజాబ్‌కు చెందిన మరో భారతీయ వలసదారుడు మాట్లాడుతూ.. తన ఏజెంట్లు మొదట ఇటలీకి తీసుకెళ్లి, తరువాత లాటిన్ అమెరికాకు తరలించారని తెలిపారు. 15 గంటల పాటు బోట్‌లో ప్రయాణించామని, 40-45 కిలోమీటర్లు నడిపించారని చెప్పాడు. నడక మార్గంలో వెళ్లేప్పుడు తమకు చెందిన రూ. 35,000 విలువైన బట్టలు మార్గమధ్యలో దుండగులు దొంగిలించారని తెలిపారు. ‘మేము 17-18 కొండలు దాటాం. అక్కడి నుంచి జారిపడితే బతికే అవకాశమే లేదు. ఎవరైనా గాయపడితే, వారు చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అలా దారిలో ఎన్నో మృతదేహాలను చూశాం’ అని తెలిపారు.






