- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IIT INDORE: ఇండోర్ 'ప్రత్యేక బూట్లు'.. వారికోసమేనట.!
దేశ భద్రత కొరకు.. నిరంతరం శ్రమించే భారత సాయుధ దళాల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐఐటీ ఇండోర్ విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక బూట్లను డిజైన్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ భద్రత కొరకు.. నిరంతరం శ్రమించే భారత సాయుధ దళాల కోసం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 'ఐఐటీ ఇండోర్' విద్యుత్ ను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక బూట్లను డిజైన్ చేసింది.ఇవి ధరించి నడవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కావడమే కాకుండా, ఆ సైనికుడు ఉన్న ప్రదేశానికి సంబంధించిన లొకేషన్ ను కూడా తెలుసుకోవచ్చు.
విద్యుత్ ను ఉత్పత్తి చేసే షూస్:
సాయుధ దళాల సిబ్బంది భద్రత, సామర్ధ్యాన్ని పెంపొందించే ఆవిష్కరణలో భాగంగా.. భారతీయ సైనికుల కోసం ఇండోర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ(IIT) విద్యుత్ ను ఉత్పత్తి చేసే షూస్ లను రూపొందించింది.
జీపీఎస్ లొకేషన్ తో..
ఆ షూస్ ధరించి నడవటం వల్ల వ్యక్తిలో జనించిన విద్యుత్, షూస్ అడుగు భాగంలో అమర్చిన పరికరంలో నిల్వ అవుతుంది. ఆ విద్యుత్ సై నికుడి వద్ద ఉన్న చిన్నచిన్న పరికరాలను ఆపరేట్ చేయడానికి, చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(GPS), రేడియొ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(RFID) టెక్నాలజీ కలిగిన ఈ షూస్ ఆ సైనికుడు ఉన్న లొకేషన్ ను రియల్ టైమ్ లో గుర్తించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇవి విద్యార్థులు, పర్వతారోహకులు, మరియు సీనియర్ సిటిజన్ లకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.






