భలే ఐడియా ఈ స్మార్ట్ రీసైక్లింగ్.. ప్లాస్టిక్ ఇస్తే బ్యాగ్ ఫ్రీ

by Prasad Jukanti |

మెరీనా బీచ్‌లో ప్లాస్టిక్ బాటిల్ డిపాజిట్ చేస్తే ఉచితంగా ఎకో-ఫ్రెండ్లీ బ్యాగ్ ఇచ్చే స్మార్ట్ మిషన్ ఏర్పాటు చేశారు.

భలే ఐడియా ఈ స్మార్ట్ రీసైక్లింగ్.. ప్లాస్టిక్ ఇస్తే బ్యాగ్ ఫ్రీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకు పర్యావరణానికి పెను సవాలుగా మారుతోంది. ఆధునిక జీవనశైలిలో మానవులకు ప్లాస్టిక్ ఇప్పుడు ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో అనేక పర్యాటక ప్రాంతాల్లో ప్లాసిక్ వ్యర్థాలు కుప్పులు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించేలా చెన్నైలోని ప్రముఖ మెరీనా బీచ్‍లో వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్లాసిక్ బాటిల్ డిపాజిట్ చేస్తే ఉచితంగా ఎకో-ఫ్లెండ్లీ బ్యాగ్‍లు ఇచ్చేలా సరికొత్త మిషన్ ను బీచ్ లో ఏర్పాటు చేశారు.

గుడ్ రెస్పాన్స్:

దీంతో ఇప్పుడు బీచ్ కు వస్తున్న పర్యాటకులు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడా ఇక్కడా పారేయకుండా ఈ మిషన్ వద్ద డిపాజిట్ చేసి ఉచితంగా పర్యావరణ సరిత బ్యాగులు తీసుకుంటున్నారు. ఇందుకు సంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు స్పందిస్తూన్నారు. ఇలాంటి 'స్మార్ట్' రీసైక్లింగ్ పద్దతులు దేశంలోని మిగతా అన్ని నగరాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Next Story