- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాహుల్ కాంగ్రెస్‌ను నాశనం చేస్తే మాకు సంబంధం లేదు’
by Sathputhe Rajesh |
విదేశీ గడ్డపై భారత్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: విదేశీ గడ్డపై భారత్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన లండన్‌లో 'భారత దేశంలో ప్రజాస్వామ్యం’ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దేశ వ్యతిరేకులు మాట్లాడే మాటలనే రాహుల్ మాట్లాడారని ఫైర్ అయ్యారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తే అది మనకు సంబంధం లేని విషయం కానీ దేశ పౌరుడిగా ఆయన దేశాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే మౌనంగా ఉండలేమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని కించపరచడానికి ఎవరికి అనుమతి లేదని రాహుల్ గాంధీ దేశానికి హాని చేయాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోలేమని అన్నారు.
Next Story






