- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై అత్యాచారం.. ఆపై మతం మార్చి ఘోరం
మత్తు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై ఆమె క్లాస్‍మెట్ అయిత్యానికి పాల్పడ్డాడు. మౌలానాతో మతం మార్పించి బీఫ్ తినమని బలవంతపెట్టినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై ఆమె స్నేహితుడు అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా బలవంతంగా మతమార్పిడికి పాల్పడటం కలకలం రేపింది. వారి వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇక భరించలేక చివరకు జరిగిన విషయంలో తన భర్తకు చెప్పడంతో తాజాగా పోలీసులకు ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు అయాజ్ మదారేతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. .
అసలేం జరిగిందంటే:
నాగ్‍పూర్‍కు చెందిన ఐఏఫ్ అధికారి భార్య (24) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు తన క్లాస్ మెట్ అయిన అయాజ్ తాజ్ మదారే అనే వ్యక్తి ఒక భూమి విషయంలో మాట్లాడాలంటూ బాధితురాలికి దగ్గర అయ్యాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక భూమికి సంబంధించి మాట్లాడుదామని ఒక హోటల్‍లో సమావేశానికి ఆహ్వానించినట్లు బాధితురాలు ఆరోపించింది. అక్కడ తనకు శీతలపానియంలో మత్తు పదార్థం కలిపి ఇచ్చాడని ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయిన తనపై అత్యాచారానికి పాల్పడి రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీశాడని ఆరోపించింది. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను చూయిస్తూ బ్లాక్ మెయిల్ చేసి అతడి స్నేహితులతో కూడా కలిసి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డినట్లు ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే ఫోటోలు, వీడియోలు తన భర్తకు పంపిస్తానని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించినట్లు పేర్కొంది.
మతమార్పిడి పెళ్లి:
మే 31న కల్మేశ్వర్ అనే ప్రాంతానికి తీసుకువెళ్లి ఓ మౌలానా సాయంతో మతం మార్చి బలవంతంగా వివాహం చేసుకున్నాడని, అలాగే తనను బీఫ్ తినాలని బలవంతం చేశాడని ఆరోపించింది. అతడి వేధింపులు తాళలేక చివరకు ఈ విషయం తన భర్తకు చెప్పింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కీలకంగా మారిన వీడియో:
రంగంలోకి దిగిన పోలీసులు అయాజ్ సహా ముగ్గురిని అరెస్టు చేయగా మతమార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మౌలానా కోసం గాలింపు చేపట్టారు. కాగా ఈ కేసులో ఒక వీడియో కీలక సాక్ష్యంగా మారింది. ఆ వీడియోలో నిందితుడు అయాజ్ సదరు మహిళకు మత్తు మందు ఇచ్చి ఓ ద్రవాన్ని చల్లుతూ హిప్నటైజ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. డీసీపీ సురేష్ రెడ్డి మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేరకు లోతైన విచారణ జరుపుతున్నామని ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ టెస్ట్ కు పంపించామన్నారు. పరారీలో ఉన్న మౌలానా కోసం ఒక బృందం మధ్యప్రదేశ్‌కు వెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన నాగపూర్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇటీవల టీసీఎస్ లో తోటీ ఉద్యోగులపై బలవంతంగా మతమార్పిడుల ఘటన పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులోనూ ఏకంగా మౌలాన చేత బాధితురాలికి మతమార్పిడి చేయడంతో పాటు ఏకంగా పెళ్లి చేసుకోవడం, బీఫ్ తినమని బలవంత పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది.






