- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : సీఎంను నరికి బ్యాగులో కుక్కుతాను : సిద్ధ రామయ్యకు బెదిరింపు మెయిల్స్
ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే చంపేస్తామని బెదిరింపు మెయిల్స్(Threat Mails) రావడం ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర సంచలనం రేగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే చంపేస్తామని బెదిరింపు మెయిల్స్(Threat Mails) రావడం ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర సంచలనం రేగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య(Karnataka CM Sidha Ramaiah) కార్యాలయానికి సీఎంను దారుణంగా చంపేస్తానని బుధవారం మధ్యాహ్నం ఓ దుండగుడు బెదిరింపు మెయిల్స్ చేశాడు. కాగా ఈ మెయిల్స్ పై దృష్టి పెట్టిన విధానసౌధ పోలీసులు.. సింధార్ రాజ్ పుత్ ఐడీ పేరుతో మెయిల్స్ వచ్చినట్టు గుర్తించారు. ఐడీ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలను కనుక్కునే పనిలో ఉన్నట్టు అధికారులు తెలఅయితే అదే దుండగుని నుంచి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM DK Shiva Kumar) కు కూడా మెయిల్స్ వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. సీఎం. డిప్యూటీ సీఎంలను ఇద్దరినీ నరికి బ్యాగులో వేస్తానని మెయిల్ లో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు FIR నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






