- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనవసరంగా నన్ను వివాదంలోకి లాగారు: ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె
తన ప్రచురించబడిన పుస్తుతం 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' చుట్టూ జరిగిన రాజకీయ వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే (Manoj Naravane) రాసిన, ప్రచురితం కాని ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ (Four Stars of Destiny) పుస్తకంపై రాజీకీయంగ దుమారం రేగిన వేళ ఆయన తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రింట్ కానీ పుస్తకంలోని అంశాలను తీసుకుని తనను వివాదాల్లోకి లాగడం ఏమాత్రం సమర్థనీయం కాదని కామెంట్ చేశారు. తాను రాసిన పుస్తకాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించే వరకు నిలిపివేయాలని పబ్లిషర్‌ను కోరినట్లుగా వెల్లడించారు. నా వరకు ఆ అధ్యాయం ముగిసిందని.. కానీ అనవసరంగా నన్ను, తన పుస్తకాన్ని వార్తల్లోకి లాగడం సరికాదని అభ్యతరం వ్యక్తం చేశారు.
మరో పుస్తకం విడుదల..
అయితే, వివాదాలను పట్టించుకోకుండా తాను ముందుకు సాగుతున్నానని చెబుతూ, ఆయన తాజాగా ‘The Curious and the Classified: Unearthing Military Myths and Mysteries’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకం సైనికపరమైన ఆసక్తికర కథనాలు, సంప్రదాయాల గురించి వివరిస్తుందని మనోజ్ నరవణే పేర్కొన్నారు. ‘జై హింద్’ అనే నినాదాన్ని మొదట ఎయిర్ ఫోర్స్ వాడగా, ఆ తర్వాత ఆర్మీ, నేవీలు స్వీకరించాయని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. అదేవిధంగా అస్సాం రెజిమెంట్ వీరుడు ‘బద్లురామ్’ కథ, 1971 యుద్ధంలో పాకిస్థాన్ నుంచి తప్పించుకుని 37 ఏళ్లు సేవ చేసిన ‘పెడోంగి’ అనే గుర్రం గురించి తన పుస్తకంలో నవరణే ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ ప్రచురించబడని పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించగా, ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.






