- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థాయ్‌లాండ్ - కాంబోడియా యుద్ధం ఆపింది నేనే : ట్రంప్
థాయ్‌లాండ్ - కాంబోడియా(Thailand - Cambodia) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire) జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : థాయ్‌లాండ్ - కాంబోడియా(Thailand - Cambodia) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire) జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. థాయ్‌లాండ్, కాంబోడియాల ప్రధానులైన హున్ మనెట్, ఫుమ్తామ్ వీచయాచైతో తానూ స్వయంగా మాట్లాడాను అని, తన జోక్యం వల్లే ఇరు దేశాలు సీజ్‌ఫైర్ ప్రకటించాయని పేర్కొన్నారు. గత భారత్-పాక్. ఇజ్రాయెల్-ఇరాన్ తోసహా గత ఆరునెలల్లో ఎన్నో యుద్ధాలు ఆపానని, ప్రెసిండెంట్ ఆఫ్ పీస్ అయినందుకు గర్వంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా థాయ్‌లాండ్ - కాంబోడియా సరిహద్దుల్లోని ఖ్మెర్-హిందూ ఆలయం విషయంలో తలెత్తిన వివాదం కారణంగా జులై 24న ప్రారంభం అయిన సైనిక దాడులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. ఈ దాడుల్లో ఇరు దేశాలలో కనీసం 35 మంది (సైనికులు, సామాన్య పౌరులతో సహా) మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. 2,00,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ASEAN అధ్యక్షుడిగా, సీజ్‌ఫైర్ చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని UNO ప్రతిపాదించింది. దీంతో కాంబోడియా ప్రధాని హున్ మనెట్, థాయ్‌లాండ్ యాక్టింగ్ ప్రధాని ఫుమ్తామ్ వీచయాచై మలేసియాలోని పుత్రజయలో నేడు చర్చలు జరపడానికి అంగీకరించారు. ఈ చర్చలు సఫలం అయ్యి నిబంధనలు లేని తక్షణ సీజ్‌ఫైర్ అమలులోకి వచ్చినట్లు కాంబోడియా, థాయ్‌లాండ్, మలేసియా నాయకులు ఓ ప్రకటన జారీ చేసారు.






