- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ఇంకా ఎంత బతుకుతానో తెలీదు.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో భద్రతా వలయాన్ని దాటి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించిన సాయుధ దుండగుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు కాల్చి చంపారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నివాసమైన ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో (Mar-a-Lago) రిసార్ట్ వద్ద సోమవారం కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున ఆయుధాలతో లోపలికి చొరబడటానికి ప్రయత్నించిన ఓ యువకుడిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. ఈ క్రమంలోనే తన రిసార్ట్‌లో కాల్పులు ఘటనపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా ఎంతకాలం బతికి ఉంటానో తనకు కూడా తెలియదు. చాలా మంది తనను టార్గెట్‌గా చేసుకుని గన్ గురిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనపై జరిగిన హత్యాయత్నాలను గుర్తుచేసుకున్న ఆయన.. క్రూరమైన షూటర్లు కేవలం దేశంపై ప్రభావం చూపగలిగే (Consequential) అధ్యక్షులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారని కామెంట్ చేశారు. అందులో భాగంగానే అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెన్నెడీ వంటి గొప్ప నాయకులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ భావోద్వేగానికి లోనయ్యారు.






