- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కొడుకు అడిగిన బిర్యానీ తెచ్చా.. కంటతడి పెట్టిస్తున్న పేద తండ్రి వీడియో
బిర్యానీ తినడం ఒక కలగా మారిన పేద కుటుంబం.. కొడుకు కోరిక తీర్చి తండ్రి పొందిన ఆనందం నెటిజన్లను కదిలిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుత రోజుల్లో బిర్యానీ (Biryani) అనేది చాలా మందికి సాధారణ ఆహారంగా మారిపోయింది. ఏ చిన్న పండగ వచ్చిన బిర్యానీ చేసుకోవడం అలవాటుగా మారుతోంది. ఇదంతా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారికి బిర్యానీ కొనుగోలు చేసుకోనే స్తోమత ఉండవచ్చు. కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, పేద కుటుంబాలకు మాత్రం బిర్యానీ తినడం అనేది ఇప్పటికీ ఓ కల. అటువంటి ఒక పేద కుటుంబంలో ఓ కొడుకు బిర్యానీ కల ఎట్టకేలకు సాకారమైంది. తన తండ్రి ఓ బిర్యానీ తీసుకురాగా ఆ తండ్రి కొడుకులు కలిసి తింటున్న ఆ హార్ట్ టచ్చింగ్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
కొడుకు కళ్లలో తండ్రి ఆనందం:
నారాయణ్ సర్కార్ అనే వ్యక్తి తన దైనందిన జీవితంలోని విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. తన కొడుకు ఎప్పటి నుంచో బిర్యానీ కావాలని అడుగుతున్నా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ తండ్రి ఆ కోరికను తీర్చలేకపోయారు. కానీ, తాజాగా బిర్యానీపై డిస్కౌంట్ రావడంతో.. మూడు ప్యాకెట్లు కొని తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఆరగించారు. తన కొడుకు ఆత్రంగా బిర్యానీ తింటుంటే, ఆ తండ్రి కళ్లలో కనిపించిన తృప్తి, ముఖం మాటల్లో వర్ణించలేము. ఈ వీడియోను నారాయణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా లక్షలాది మంది వీక్షకులు కదిలిపోయారు. ఒక చిన్న బిర్యానీ ప్యాకెట్ కోసం పేద కుటుంబాలు పడే ఆరాటం, కన్నబిడ్డ కోరిక తీర్చినప్పుడు తండ్రి పొందే ఆనందం ఈ వీడియోలో ప్రతిబింబిస్తున్నాయని ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఆ కుటుంబంలో మరిన్ని కలగాలి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.






