సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-28 05:29:25  IST  )

కర్ణాటక పాలిటిక్స్‌లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకున్నది.

సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం సిద్దరామయ్య నివాసంలో కాంగ్రెస్ నేతలతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ముగిసింది. ఇందులో భాగంగా హైకమాండ్ నిర్ణయాన్ని ఆయన మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి పదవికి మనస్ఫూర్తిగా రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తనకు లోపల ఎలాంటి బాధ లేదని.. ఇన్నాళ్లు అందరి సహకారానికి కృతజ్ఞతలని అన్నారు. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నానని, కేబినెట్‌ను రద్దు చేయబోతున్నానని సిద్దరామయ్య అధికారికంగా ప్రకటించారు.

Next Story