US: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి

by Shamantha N |

అమెరికాలో(United States ) మరోసారి కాల్పుల కలకలం జరగింది. కాల్పుల ఘటనలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు.

US: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో(United States ) మరోసారి కాల్పుల కలకలం జరగింది. కాల్పుల ఘటనలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో(Washington DC) ‌సోమవారం దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ(26) చనిపోయాడు. హైదరాబాద్(Hyderabad) చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవి తేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. అక్కడ అతను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అయితే, కాల్పుల ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రవితేజ మృతి సమాచారం తెలియడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇకపోతే, నెల రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ వార్త మరవక ముందే మరో హైదరాబాదీ యువకుడు కాల్పుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది.

Next Story