- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాస్టల్లో ఉన్న భార్యను చంపి సెల్ఫీ.. ఆపై వాట్సాప్ లో స్టేటస్
కోయంబత్తూరులో జరిగిన భార్య హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: కోయంబత్తూరులో జరిగిన భార్య హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కట్టుకున్న భార్యను కొడవలితో నరికి చంపడమే కాకుండా.. హత్యానంతరం భార్య డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఈ ఘటన రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునల్వేలికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య భర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు రావడంతో భర్త మురుగన్ కు దూరంగా శ్రీప్రియ ఓ మహిళల హాస్టల్ లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది.
తనకు దూరంగా వెళ్లిన భార్య మరో మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న మురుగున్.. శ్రీప్రియను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఆదివారం (నవంబర్ 30) మధ్యాహ్నం తనతో మాట్లాడాలని చెప్పి హాస్టల్ వద్దకు వెళ్లాడు. వెళ్తూనే తనతోపాటు కొడవలిని తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో మురుగున్ కొడవలితో శ్రీప్రియపై దాడిచేసి.. దారుణంగా నరికి చంపాడు. శ్రీప్రియ హత్య తర్వాత రక్తపు మడుగులో ఉన్న ఆమెతో సెల్ఫీ తీసుకుని మోసానికి ప్రతిఫలం మరణం అనే క్యాప్షన్ పెట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.
హత్యానంతరం హాస్టల్ లో ఉన్నవారంతా భయంతో పరుగులు తీయగా.. మురుగన్ మాత్రం పోలీసులు వచ్చే వరకూ అక్కడే కూర్చున్నాడు. రత్నపురి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, హత్యకు వాడిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






