హోటల్‌లో రొమాన్స్.. పోలీస్ స్టేషన్‌లో డివోర్స్..

by Sujitha Rachapalli |

భర్తను మోసం చేస్తూ హోటల్‌లో భార్య రొమాన్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులను పిలిచిన భర్త పోలీస్ స్టేషన్ పంచాయితీలో కథలో కీలక మలుపు

హోటల్‌లో రొమాన్స్.. పోలీస్ స్టేషన్‌లో డివోర్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ చందౌళీ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ అయిన భర్తను మోసం చేస్తూ మరో వ్యక్తితో గడిపేందుకు హోటల్‌కు వెళ్లింది భార్య. ఈ విషయంపై అనుమానం వచ్చిన భర్త.. భార్యను ఫాలో కాగా.. హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. కొన్ని నెలలుగా ఈ ఇల్లీగల్ ఎఫైర్ నడుస్తుండగా.. ఫైనల్‌గా క్యాచ్ చేసి.. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత ఇరువైపుల కుటుంబాలను పిలిచి మాట్లాడగా.. అమ్మాయి చేసిన తప్పును ఒప్పుకోగా.. అబ్బాయి తనతో ఉండేందుకు సిద్ధంగా లేనని.. ఈ నమ్మకద్రోహాన్ని భరించలేనని చెప్పాడు. చర్చల తర్వాత ఇద్దరు కూడా విడాకులు తీసుకునేందుకు అంగీకరించారు. మొత్తానికి ఒక్క రోజులోనే భార్యాభర్తల జీవితం పూర్తిగా మారిపోగా.. ఈ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story