- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోనియా ఆదివాసీలను అవమానించారు : ప్రధాని మోడీ
రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని, కాంగ్రెస్ నేతలు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

- రాష్ట్రపతి గౌరవాన్ని దెబ్బతీశారు
- భాష, యాస అర్థం కాక అలా అనిపించి ఉండొచ్చు
- లేఖ విడుదల చేసిన రాష్ట్రపతి భవన్
దిశ, నేషనల్ బ్యూరో:
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మోడీ స్పందించారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న ముర్మను అవమానించడం అంటే.. ఆదివాసీలను అవమానించడమే అని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని ద్వారకలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకత్వం తన అగౌరవాన్ని, అహంకారాన్ని రాష్ట్రపతి పట్ల చూపించిందని అన్నారు. ఆ రాయల్ ఫ్యామిలీకి ఆదివాసీ వర్గం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము ప్రసంగం బోర్ కొట్టిందట అని మోడీ వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై రాష్టర్పతి భవన్ కూడా స్పందించింది. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది ప్రముఖ నేతలు మీడియా పాయింట్ వద్ద స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ప్రసంగం చివరకు వచ్చే సరికి రాష్ట్రపతి అలసి పోయి మాట్లాడలేక పోయారని వ్యాఖ్యానించారు. దేశంలోని అత్యున్నత పదవి గౌరవానికి భంగం కలిగేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమని, కాంగ్రెస్ నేతలు ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
'కాంగ్రెస్ నాయకుల మాటలు సత్యదూరంగా ఉన్నాయి. రాష్ట్రపతి ప్రసంగం చేసే సమయంలో ఎప్పుడూ అలసి పోలేదు. పైగా అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడే సమయంలో ఆమెకు అసలు అలసటే రాదు. రాష్ట్రపతిపై వ్యాఖ్యలు చేసిన వారికి భారత యాస, భాషల పట్ల పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు' అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రెసిడెంట్ ముర్మును ఉద్దేశించి సోనియా గాంధీ 'పూర్ థింగ్' (జాలి చూపించడం అనే ఉద్దేశంతో వాడిన పదం) అని మాట్లాడటంపై నాతో పాటు బీజేపీ కార్యకర్తలందరూ తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. కాంగ్రెస్ పార్టీది జమీందారీల ఆలోచనా ధోరణి. వారది పేదల వ్యతిరేక, ఆదివాసీ వ్యతిరేక మనస్తత్వం అని నడ్డా విమర్శించారు.
సోనియా గాంధీ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్దమైనవి. పార్లమెంటులో ప్రసంగం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము అలసి పోయారని.. పూర్ థింగ్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమైనవి. గౌరవ రాష్ట్రపతిపై జాలి పడాల్సిన అవసరం లేదు. ఇండియా ఒక గణతంత్ర దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు.






