Rahul Gandhi: ఢిల్లీ ఎయిమ్స్‌ వద్ద దుస్థితి.. నడ్డా, ఆతిశీలకు రాహుల్‌ గాంధీ లేఖ

by Shamantha N |

ఢిల్లీ ఎయిమ్స్(AIIMS) దగ్గరి దుస్థితిపై కేంద్రఆరోగ్య మంత్రి జేపీ నడ్డా(JP Nadda), ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీలకు(Delhi Chief Minister Atishi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు.

Rahul Gandhi: ఢిల్లీ ఎయిమ్స్‌ వద్ద దుస్థితి.. నడ్డా, ఆతిశీలకు రాహుల్‌ గాంధీ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎయిమ్స్(AIIMS) దగ్గరి దుస్థితిపై కేంద్రఆరోగ్య మంత్రి జేపీ నడ్డా(JP Nadda), ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీలకు(Delhi Chief Minister Atishi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లేఖ రాశారు. ఎయిమ్స్‌కు వచ్చే రోగులు, వారి సహాయకుల దయనీయ పరిస్థితులపై లేఖలో ప్రస్తావించారు. రోగులు, వారి సహాయకులు ఆస్పత్రి వెలుపల మెట్రో స్టేషన్‌ కింద చలిలో పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. అక్కడ తాగునీరు, బాత్రూం వంటి కనీస వసతులు కరవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసరాల్లో చెత్తాచెదారం పడి ఉందని వెల్లడించారు. మానవీయ కోణంలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ప్రజారోగ్య వ్యవస్థకు నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు.

ఎయిమ్స్ లో సౌకర్యాల కోసం..

కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఈ వ్యవస్థాగత సమస్యను గుర్తించి పరిష్కరించాలని జేపీ నడ్డాను రాహుల్ కోరారు. తొలి అడుగుగా, దేశవ్యాప్తంగా కొత్త ఎయిమ్స్ సౌకర్యాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంతో ప్రాథమిక స్థాయి నుండి అన్ని స్థాయిలలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ఆరోగ్య సంరక్షణ పథకాలను సమీక్షించాలన్నారు. అర్హత, నమోదు చేసుకున్న ఆస్పత్రులు, సహా రోగుల నుంచి ఖర్చులను వీలైనంత వరకు తగ్గించాలన్నారు.

Next Story