భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరితే సుంకాల్లో భారీ తగ్గింపు!

by Yella Dhawani Reddy |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం మూడు నెలల క్రితం భారత్‌పై విధించిన 26 శాతం దిగుమతి సుంకాలకు సంబంధించి గణనీయమైన మార్పు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరితే సుంకాల్లో భారీ తగ్గింపు!
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donarld Trump) ప్రభుత్వం మూడు నెలల క్రితం భారత్‌పై విధించిన 26 శాతం దిగుమతి సుంకాలకు సంబంధించి గణనీయమైన మార్పు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే, ప్రస్తుతం ఉన్న భారీ దిగుమతి సుంకాలు 20 శాతం దిగువకు తగ్గిపోతాయని భారత వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందుకు అమెరికా కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, లోహాల వంటి కీలక రంగాల్లో ఈ తగ్గింపు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ తాత్కాలిక ఒప్పందం ద్వారా భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. గతంలో భారత్‌కు జెనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌ (GSP) క్రింద ఇచ్చిన మినహాయింపులను అమెరికా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో సుంకాల ప్రభావం తీవ్రంగా ఉండగా, ఇప్పుడు జరిగే ఒప్పందం వల్ల భారత ఉత్పత్తులకు అమెరికాలో లాభదాయకమైన ప్రవేశం లభించనుంది. అలాగే, భారత్‌ కూడా అమెరికా ఉత్పత్తులపై విధించిన ప్రతిస్పందన సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం.

Next Story