- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: జింకను అమాంతం మింగేసిన భారీ కొండచిలువ.. వీడియో వైరల్
ఒక భారీ కొండచిలువ అమాంతం ఒక జింకను మింగేసిన ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక భారీ కొండచిలువ అమాంతం ఒక జింకను మింగేసిన ఘటన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో చోటుచేసుకుంది. జింకను మింగిన తర్వాత కదలలేని స్థితిలో ఉన్న ఆ భారీ సర్పాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. మాండ్య జిల్లా మళవల్లి తాలూకా నెట్కల్ గ్రామ సమీపంలో బెంగళూరు వాటర్ సప్లై (BWSSB) నీటి పైప్‌లైన్ ఉంది. ఆ పైప్‌లైన్ పక్కన ఉన్న ప్రాంతంలోకి వచ్చిన సుమారు 10 అడుగుల పొడవు, 30 కిలోలకు పైగా బరువున్న ఒక భారీ కొండచిలువ.. ఒక జింకను వేటాడి అమాంతం మింగేసినట్లు తెలుస్తోంది. అయితే, భారీ జంతువును ఆహారంగా తీసుకోవడంతో ఇంచు కూడా కదలలేక అది అక్కడే ఉండిపోయింది. దీన్ని గమనించిన స్థానిక యువకులు ఆశ్చర్యంతో తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.
అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన అధికారులు
కదలలేని స్థితిలో ఉన్న ఆ కొండచిలువ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, ఈ భారీ కొండచిలువను చూసి భయపడిన గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ కొండచిలువను సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని తీసుకెళ్లి ముత్తత్తి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు సమాచారం. అటవీ సిబ్బంది సకాలంలో స్పందించి దానిని అడవిలో వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.






