బ్రేకింగ్.. బీజాపూర్‌లో భారీ మొత్తంలో నక్సల్స్ డంప్ స్వాధీనం

by Malleboina Mahesh |   (  Updated:2025-10-14 03:55:02  IST  )

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సల్స్ దాచిపెట్టిన భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.

బ్రేకింగ్.. బీజాపూర్‌లో భారీ మొత్తంలో నక్సల్స్ డంప్ స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సల్స్ దాచిపెట్టిన భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. తడ్పల బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన కోబ్రా 206, సీఆర్పీఎఫ్ 229, 153, 196 బెటాలియన్‌లతో పాటు బీజాపూర్ పోలీసుల సంయుక్త బృందం KGH పర్వత ప్రాంతంలో చేపట్టిన శోధన ఆపరేషన్‌లో డంప్ లభించింది. ఇందులో 51 లైవ్ BGLలు, 100 బండిల్స్ HT అల్యూమినియం వైర్, 50 స్టీల్ పైపులు, 20 ఇనుప షీట్లు, 40 ఇనుప ప్లేట్లు, పెద్ద మొత్తంలో విద్యుత్ వైర్లను పోలీస్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

శోధన సమయంలో నక్సల్స్ అమర్చిన ఐదు ప్రెజర్ IEDలను కూడా భద్రతా దళాలు గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేశారు. నక్సల్స్ పోలీస్ పెట్రోలింగ్ బృందాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ పేలుడు సామగ్రిని దాచి పెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా భద్రతా బలగాలు ఒక పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాయని బీజాపూర్ ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మరిన్ని నక్సల్ కదలికలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Next Story