Maha Kumbhamela : మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

by Muthe.Rajitha |   (  Updated:2025-01-20 04:58:06  IST  )

యూపీలోని ప్రయాగ్ రాజ్(PrayagRaj) లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbhamela)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Maha Kumbhamela : మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : యూపీలోని ప్రయాగ్ రాజ్(PrayagRaj) లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbhamela)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. త్రివేణి సంగమం(Triveni Sangam) వద్ద సెక్టార్ 5 లోని టెంట్ల వద్ద గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భక్తులు, స్వామిజీల కోసం ఏర్పాటు చేసిన వందలాది టెంట్లు కాలి బూడిదయ్యాయి. భారీ మంటలు ఎగసి పడుతుండటంతో భక్తులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం గురించి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా కింద భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండగానే పైన గల రైల్వే బ్రిడ్జి పై నుంచి రైలు వెళ్తుండటం గమనార్హం.

Next Story