- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్కై స్క్రాపర్స్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వందలమంది
by Muthe.Rajitha |
హాంకాంగ్‌లోని థాయ్ పొ జిల్లాలోని ఓ భారీ స్కై స్క్రాపర్స్ సముదాయంలో బుధవారం పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హాంకాంగ్‌లోని థాయ్ పొ జిల్లాలోని ఓ భారీ స్కై స్క్రాపర్స్ సముదాయంలో బుధవారం పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఎత్తైన నివాస సముదాయాల్లో చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. 2000 ఇళ్లు ఉన్న ఈ నివాస సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటికే నలుగురు మృతి చెందగా.. వందలాది మంది చిక్కుకుపోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.
హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరగగా.. తక్షణమే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హెవీ ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే పరిసర ప్రాంతాల్లో ఎమెర్జెన్సీ ప్రకటించి, సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






