- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లిలో చికెన్ ఫ్రై కోసం పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరు వర్గాల కుటుంబ సభ్యులు
పెళ్లిలో చికెన్ సరిగా వడ్డించడం లేదని వధూవరుల తరఫున బంధువులు కొట్టుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పెళ్లి వేడుకల్లో అతిథుల మర్యాదల విషయంలో ఏ మాత్రం లోటుపాట్లు జరిగినా ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా యూపీలోని ఓ పెళ్లిలో చికెన్ ప్రై (chicken fry) కోసం ఇరువర్గాల తరుపు వారు కొట్టుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. యూపీలోని (Uttar Pradesh viral video) బిజ్నూర్ జిల్లా మజేదార్ లోని టిబ్రీ గ్రామం ఫలక్ మ్యారేజీ హాల్‍లో ఇటీవల ఓ వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పెళ్లి విందులో చికెన్ ఫ్రై తక్కువగా వడ్డిస్తున్నారని వరుడి తరపు వారు ఫిర్యాదు చేశారు. దీంతో వధువు తరపు వారు మరిన్ని ముక్కలు తెప్పించారు. ఆ తర్వాత ప్లేట్లలో చికెన్‍తో నింపేశారు. ఇలా చేయడం నచ్చని వధువు తరపు బంధువులు ఆహారం మర్యాదగా, సరిగా వడ్డించాలని కోరారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరువైపుల వారు కొట్టుకున్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి ఇరువైపుల వారిని నచ్చజెప్పారు. దాంతో శాంతిచిన బంధువులు మరోసారి గొడవకు దిగడంతో మళ్లీ పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం ఇరు కుటుంబాల పెద్దలు, పోలీసు అధికారుల మధ్యవర్తిత్వంతో వధూవరులు వివాహం చేసుకున్నారు. మొత్తానికి పెళ్లి మాట అలా ఉంచితే చికెన్ కోసం కొట్టుకున్న తీరు సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. వీడియో






