- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 12 మంది మృతి
పాకిస్తాన్(Pakistan) రాజధాని ఇస్లామాబాద్(Islamabad)లో భారీ బాంబు పేలుడు జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్(Pakistan) రాజధాని ఇస్లామాబాద్(Islamabad)లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో కారులో బాంబు అమర్చారు. మంగళవారం మధ్యాహ్నం ఇది బ్లాస్ట్ అయింది. దీంతో అక్కడిక్కడే 12 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడు జరిగిన సమయంలో కోర్టు ప్రాంగణంలో భారీ ట్రాఫిక్, పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని తదుపరి దర్యాప్తు కోసం చుట్టుపక్కల ప్రాంతంలో ఆంక్షలు విధించారు.
ఇదిలా ఉంటే.. సోమవారం సాయంత్రం సరిగ్గా 6.52గంటల సమయంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్, ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు విచారణ చేస్తున్నాయి. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే.. పాకిస్తాన్‌లో బాంబ్ బ్లాస్టింగ్ జరగడం హాట్ టాపిక్‌గా మారింది.






