Chattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్?

by Muthe.Rajitha |

ఛత్తీస్‌గఢ్(Chattisgarh) లోని బీజాపూర్(Bijapur) అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లినట్టు సమాచారం.

Chattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్?
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్(Chattisgarh) లోని బీజాపూర్(Bijapur) అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లినట్టు సమాచారం. బీజాపూర్ సమీపంలో సోమవారం మరో భారీ ఎన్కౌంటర్(Encounter) జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు(Moists) మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. నేటి సాయంత్రం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మరోసారి భీకర కాల్పులు జరగగా.. ఈ కాల్పుల్లో 20 మంది మావోలు మృతి చెందగా.. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కర్రెగుట్టల ఘటనలో ఇటీవలే మావోయిస్టులు కాల్పులు విరమిస్తున్నట్టు(Ceasefire) ప్రకటించగా.. ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో కేంద్రం కూడా ఆపరేషన్ కగార్(Operation Kagar) ను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో నేడు మరోసారి ఈ భీకర ఎన్కౌంటర్ జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఆపరేషన్ కగార్ నిలిపివేత నిజమా కాదా అని అన్ని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే నేడు ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్లో ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు లింగాల, కంచాల, మినగట్టు గ్రామాలకు చెందిన నలుగురిని కాల్చిచంపడం కూడా కలకలం రేకెత్తించింది.

Next Story