- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కారు చర్యలు
హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) విషయంలో ట్రంప్ చర్యలు చేపట్టింది. ఆ యూనివర్సిటీకి అందించే ఫెడరల్ నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) విషయంలో ట్రంప్ చర్యలు చేపట్టింది. ఆ యూనివర్సిటీకి అందించే ఫెడరల్ నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. యూనివర్సిటీపై కొన్ని విధానపరమైన మార్పులు తీసుకురావాలని సూచించినప్పటికీ.. దానికి ఒప్పుకోకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్ మాస్ ప్రకటించారు. బడ్జెట్, పన్ను మినహాయింపుల్లో కోతలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ డిమాండ్లను నెరవేర్చే వరకు హార్వర్డ్‌కు ఎటువంటి కొత్త గ్రాంట్లు మంజూరుచేయమని స్పష్టం చేశారు. ఫెడరల్ పరిశోధన గ్రాంట్లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుందని.. యూనివర్సిటీ ట్యూషన్ ఫీజులను చెల్లించడానికి విద్యార్థులకు సహాయపడే ఫెడరల్ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని మెక్ మాస్ పేర్కొన్నారు. కొత్త గ్రాంట్లకు అర్హత పొందుందకు హార్వర్డ్ యూనివర్సిటీ ఫెడరల్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి ఉంటుందని అన్నారు.
ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా..
మరోవైపు, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న విదేశీ విద్యార్థులకు హార్వర్డ్‌లో ప్రవేశం కల్పిస్తూ.. దేశ అత్యున్నత విద్యావ్యవస్థను అపహాస్యం చేసిందని మెక్ మాస్ ఆరోపించారు. మరోవైపు, యూనివర్సిటీపై జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. ట్రంప్ సర్కారు చర్యను హార్వర్డ్ యూనివర్సిటీ వ్యతిరేకించింది. ప్రభుత్వం చేసే చట్టవిరుద్ధమైన డిమాండ్లను పాటించడానికి నిరాకరించడంతోనే ఈ చర్యలు చేపట్టిందని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తమను ఎన్నిరకాలుగా అణచివేయడానికి ప్రయత్నించినా పోరాడుతూనే ఉంటామని అన్నారు.






