Hormuz: హార్ముజ్ జలసంధి మూసివేత.. తుది నిర్ణయం తీసుకోని ఇరాన్ !

by B.Srinivas |

ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన అనంతరం ప్రతీకార చర్యగా హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ భావించిన విషయం తెలిసిందే.

Hormuz: హార్ముజ్ జలసంధి మూసివేత.. తుది నిర్ణయం తీసుకోని ఇరాన్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన అనంతరం ప్రతీకార చర్యగా హార్ముజ్ (Hormuz) జలసంధిని మూసివేయాలని ఇరాన్ భావించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఆ దేశ పార్లమెంట్ సైతం ఆమోదించింది. అయితే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనుమతిస్తే ఇది అమల్లోకి రానుంది. కానీ ఆ జల సంధిని మూసి వేయాలనే తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు. అంతేగాక ఇరాన్ పార్లమెంట్ సైతం ఆ బిల్లును పాస్ చేయలేదని తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేయాలని డిసిషన్ తీసుకున్నామని, కానీ దీనిపై తుది నిర్ణయాన్ని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కే వదిలేశామని రివల్యూషనరీ గార్డ్స్ సీనియర్ కమాండర్ ఇస్మాయిల్ కోసారి (Ismail kosari) తెలిపారు. ఆ జల సంధిని మూసివేస్తే ప్రపంచ చమురు మార్కెట్లో గందరగోళం ఏర్పడుతుందనే భయాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Next Story