13 కు చేరిన హాంకాంగ్ అగ్ని ప్రమాద మృతులు.. మరింత పెరిగే అవకాశం

by Muthe.Rajitha |

హాంకాంగ్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

13 కు చేరిన హాంకాంగ్ అగ్ని ప్రమాద మృతులు.. మరింత పెరిగే అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్ : హాంకాంగ్ లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడి థాయ్ పా లోని ఎతైన నివాస సముదాయాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 13 మంది మంటల్లో చిక్కుకొని మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అపార్ట్మెంట్లలో ఇంకా అనేక మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

అగ్ని ప్రమాద వీడియోలు భయానకంగా ఉండగా.. నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 2000 పైగా నివాసాలు ఉన్న ఎత్తైన నివాస భవనాల్లో ఏర్పడిన చిన్న అగ్నిప్రమాదం వేగంగా భవనాలు చుట్టేసింది. అందులో నివసిస్తున్నవారు బయటపడే మార్గాల్లో దట్టమైన మంటలు, పొగ ఎగిసిపడటంతో వారు అందులోనే చిక్కుకున్నారు.

Next Story