Meghalaya honeymoon murder Case : హనీమూన్ మర్డర్ కేసు.. ఇకపై కఠిన చర్యలన్న సర్కార్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-14 15:54:04  IST  )

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(Honeymoon Murder Case) గురించి తెలిసిందే.

Meghalaya honeymoon murder Case : హనీమూన్ మర్డర్ కేసు.. ఇకపై కఠిన చర్యలన్న సర్కార్
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(Honeymoon Murder Case) గురించి తెలిసిందే. పెళ్ళయిన తర్వాత హనీమూన్ పేరుతో మేఘాలయ(Meghalaya)కు తీసుకువెళ్ళి రాజా రఘువంశీని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది సోనమ్(Sonam). తొలుత ఈ ఘటనపై మేఘాలయ రాష్ట్రంపై పలు విమర్శలు వచ్చాయి. ఇష్టం లేని పెళ్లి చేయడంతో భార్యే హత్య చేయించిందని అనంతరం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మర్డర్ కేసు నేపథ్యంలో మేఘాలయ సర్కార్ చర్యలకు దిగింది. అక్కడి ప్రజల సేఫ్టీ కోసం పర్యాటక చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు ఆ రాష్ట్ర మంత్రి పాల్ లింగ్డో తెలిపారు. టూరిజం పేరుతో రాష్ట్రంలోకి నేరస్తులు అడుగు పెడితే సహించబోమని, వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ రాష్ట్ర ప్రజలు చాలా శాంతి, అహింసా పరులని.. అలాంటి వారిపై నిందలు పడనివ్వబోమని స్పష్టం చేశారు.

Next Story