- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు
నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ కమ్యూనిస్టు నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ (VS Achuthanandan) (101) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెల 23న గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అంతేగాకుండా.. మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2006 నుంచి 2011 వరకు ఆయన కేరళకు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. 1923 అక్టోబరు 20న కేరళలో వెనకబడిన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్.. లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు.. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలకఘట్టాలను వి.ఎస్.అచ్యుతానందన్ చూశారు.






