- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Flash News : రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
తమిళనాడులో అగ్రహీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో అగ్రహీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అగ్రనటుడైన రజనీకాంత్, హీరో ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నై డీజీపీ కార్యాలయానికి మంగళవారం తెల్లవారుజామున ఈ మేరకు ఈ మెయిల్ వచ్చింది. పోయస్ గార్డెన్లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇళ్లతో పాటు.. కీల్పాక్కంలో ఉన్న టీఎన్ సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇంటిని పేల్చివేస్తామని అగంతకులు ఈమెయిల్ లో పేర్కొన్నారు.
వెంటనే బాంబు స్క్వాడ్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మెయిల్ పంపినవారిని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 3న సీఎం ఎంకే స్టాలిన్ సహా.. నటి త్రిష, బీజేపీ ప్రధాన కార్యాలయం, డీజీపీ ఆఫీసు, రాజ్ భవన్ లకు బాంబు బెదిరింపులు రాగా.. 13 మరోసారి ఎంకే స్టాలిన్, రజనీకాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.






