ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో చారిత్రక ధ్వజారోహణం

by Malleboina Mahesh |

ఈ రోజు అయోధ్యలోని శ్రీరామ్‌లల్లా ఆలయంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆలయంపై పవిత్ర ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ప్రధాని మోడీ చేతుల మీదుగా అయోధ్యలో చారిత్రక ధ్వజారోహణం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు అయోధ్యలోని శ్రీరామ్‌లల్లా ఆలయంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆలయంపై పవిత్ర ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆలయ నిర్మాణం కీలక దశలను పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న ఈ వేడుక దేశవ్యాప్తంగా రామ భక్తులకు ఒక గొప్ప సందర్భంగా నిలుస్తుంది. ఈ మహోన్నతమైన కార్యక్రమం కోసం రామ మందిరం, పరిసరాలు అపురూపంగా, సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రధానమంత్రి మోడీ పర్యటన వివరాల ప్రకారం, ఆయన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అత్యంత ముఖ్యమైన ఘట్టం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది.

ఈ శుభ సమయంలో, మోడీ శ్రీరామ్‌లల్లా ఆలయ పైభాగంలో, అంటే ప్రధాన శిఖరంపై, కాషాయ ధర్మ జెండాను లాంఛనంగా ఎగుర వేయనున్నారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అనంతరం, ఆలయ నిర్మాణం పూర్తికి ఇది ఒక బలమైన చిహ్నంగా నిలవనుంది. అయోధ్య రామ మందిరం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది. వేలాది మంది భక్తులు, ఆహ్వానితులు ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు. ధ్వజారోహణ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో రామయ్య దర్శనానికి భక్తులకు మరింత అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమం కానుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరుగుతున్న ఈ ధ్వజారోహణ, రామ మందిర చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలవనుంది.

Next Story