ముస్లింలపై పూల వర్షం కురిపించిన హిందువులు.. ‘దటీజ్ ఇండియా’ అంటున్న నెటిజన్లు

by Gantepaka Srikanth |

భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలయికే భారతదేశం.

ముస్లింలపై పూల వర్షం కురిపించిన హిందువులు.. ‘దటీజ్ ఇండియా’ అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: భిన్న మతాలు, భిన్న సంస్కృతులు కలయికే భారతదేశం. ఎన్ని మతాలుగా, ఎన్ని కులాలుగా విడిపోయి ఉన్నా.. ఓ సమయం వచ్చినప్పుడు అందరం ఒకటే అని చాటిచెబుతారు. ముఖ్యంగా అయ్యప్ప మాలలు ధరించిన వారికి ముస్లింలు(Muslims) అన్నప్రసాదాలు పెట్టడం, రంజాన్ వేళ ముస్లింలకు హిందువులు(Hindus) ఇఫ్తార్ విందులు ఇవ్వడం తరచుగా చూస్తుంటారు. తాజాగా.. ఇలాంటి రంజాన్ పండుగ వేళ అందరినీ ఆకట్టుకున్నది. రాజస్థాన్(Rajasthan) రాష్ట్రంలోని జైపూర్‌(Jaipur)లో మత సామరస్యం వెల్లివిరిసింది. జైపూర్ ఈద్గా వద్ద రంజాన్(Ramadan) రోజున మజీద్‌లో ప్రార్థనలు చేసిన వస్తున్న ముస్లింలపై హిందువులు పూల వర్షం కురిపించారు. కిలోమీటర్ల మేర పుష్పవర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి గమనించిన నెటిజన్లు.. "భిన్నత్వంలో ఏకత్వం"ని భారత్ మరోసారి చాటిచెప్పింది. దటీజ్ ఇండియా అంటూ నెటిజన్లు అంటున్నారు.

Next Story