హిందూ మతం ఒక జీవన విధానం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

హిందూ మతం ఒక జీవన విధానమని, భక్తిని చాటుకోవడానికి ఆలయానికి వెళ్లడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

హిందూ మతం ఒక జీవన విధానం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేరళలోని శబరిమల ఆలయం (Sabarimala Temple)లోకి మహిళల ప్రవేశం.. కేసు విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం, కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై గతంలో వచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను, మత స్వేచ్ఛకు సంబంధించిన కీలక అంశాలను విచారిస్తున్న సందర్భంగా.. హిందూ మతం అనేది ఒక మతం మాత్రమే కాదు.. అది ఒక విశిష్టమైన జీవన విధానమని అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించింది.

ఒక వ్యక్తి హిందువుగా కొనసాగడానికి తప్పనిసరిగా ఆలయానికి వెళ్లాలని, నిర్దిష్ట క్రతువులను నిర్వహించాలనే నిబంధన ఏదీ లేదని కోర్టు స్పష్టం చేసింది. తమ భక్తిని నిరూపించుకోవడానికి ఆలయ సందర్శనలు అవసరం లేదని, ఇంట్లో ఒక దీపం వెలిగించినా అది వారి నమ్మకాన్ని చాటడానికి సరిపోతుందని న్యాయస్థానం పేర్కొంది. ఆచార వ్యవహారాల కంటే అంతర్గత విశ్వాసానికే ప్రాముఖ్యత ఉందని చెబుతూ, హిందూ ధర్మంలో ఉన్న సరళతను, వైవిధ్యాన్ని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు (Supreme Court) నొక్కి చెప్పింది.

Next Story