మసీదులో పూజలు అందుకుంటున్న గణనాథుడు.. ప్రత్యేకత ఇదే!

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-02 17:33:19  IST  )

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా గోటఖిండి గ్రామం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ ఊరి మసీదులో గణనాథుడిని ప్రతిష్టించి పూజిస్తున్నారు ఆ గ్రామస్తులు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుండగా..

మసీదులో పూజలు అందుకుంటున్న గణనాథుడు.. ప్రత్యేకత ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా గోటఖిండి గ్రామం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆ ఊరి మసీదులో గణనాథుడిని ప్రతిష్టించి పూజిస్తున్నారు ఆ గ్రామస్తులు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతుండగా.. అన్ని మతాలకు చెందిన ప్రజలు గణేషుడి ఉత్సవాల్లో పాల్గొంటారు. హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా గణపయ్య నిమజ్జనం జరిగే వరకు మాంసం ముట్టకుండా.. భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొంటారు.

మసీదులో బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టించే సంప్రదాయం 1980లో ఆరంభమైంది. ఆ ఏడాది భారీ వర్షాలు ఉండటంతో.. మసీదులో గణపతికి పూజలు చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ ప్రత్యేక పండుగను నిర్వహిస్తున్నారు ఆ ఊరి ప్రజలు. ప్రతీ ఏటా దేవుడికి పది రోజులు పూజలు చేసి.. అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. బక్రీద్, వినాయక చవితి కలిసి వచ్చినప్పుడు ముస్లింలు మరింత ఆనందంగా పండుగ జరుపుకుంటామని చెప్తున్నారు గ్రామస్తులు.

Next Story